హీరో గోపీచంద్ కు సరైన సక్సెస్ రాక చాలా కాలం అవుతోంది.. తన కెరీర్లో చివరి గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదంటే లౌక్యం అని చెప్పవచ్చు. ఇక ఆ తరువాత అలాంటి సక్సెస్ మళ్లీ రాలేదు. ఇక జిల్ సినిమా యావరేజ్ గా ఆడింది.. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించడం జరిగింది. అయినా కూడా గోపీచంద్ సక్సెస్ కాలేకపోయాడు. ఇక సిటీమార్, ఆరడుగుల బుల్లెట్టు చిత్రాలు విడుదలవ్వగా.. ఒక మోస్తరు హీట్ ని ఇచ్చాయి. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాపైనే గోపీచంద్ తన ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి లౌక్యం సినిమా దర్శకుడు శ్రీ వాస్ తోనే తన 35వ సినిమాని తెరకెక్కించబోతున్న ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ను కూడా నేడు హైదరాబాద్లో ప్రారంభమైంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయినా కూడా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకు వెళ్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా మాత్రం డింపుల్ హయాతి నటిస్తున్నది. ఇందులో గోపీచంద్ ,డింపుల్ అమర ప్రేమికులు గా కనిపించనున్నట్లు సమాచారం.ఇటీవలే రవితేజ, విశాల్ తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గోపీచంద్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమెకు కూడా సక్సెస్ లేక పోయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హైలెట్ గా నిలుస్తోంది. అలాగే ఇందులో అలనాటి నటి ఖుష్బూ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నది.. అందుకు సంబంధించి ఈ చిత్రం యొక్క అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ఇందులో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా లౌక్యం సినిమా ని రిపీట్ చేసేలా కనిపిస్తున్నాడు గోపీచంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: