ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా చాలామంది స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని కథ నచ్చితే మల్టీస్టారర్లకు సిద్ధమేనని కూడా వెల్లడించారు.అయితే అయితే చాలా సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ కు ఏ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందని ప్రశ్న ఎదురు కాగా జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రశ్న గురించి స్పందిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును సమాధానంగా చెప్పారు. మహేష్ అన్నతో సినిమా చెయ్యాలని ఉందని చెప్పాడు.జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మహేష్ బాబు దాదాపుగా ఒకే సమయంలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఈ ఇద్దరు హీరోలకు కూడా ఒకే సమయంలో స్టార్ స్టేటస్ దక్కింది.మహేష్ క్లాస్ ఇంకా మాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలపై దృష్టి పెట్టగా తారక్ కెరీర్ తొలినాళ్లలో మాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమాలపై చాలా ఎక్కువగా దృష్టి పెట్టడం గమనార్హం. సరైన కథ దొరికితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం గ్యారంటీ అని కూడా చెప్పవచ్చు. స్టార్ డైరెక్టర్లలో ఎవరైనా ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు వేస్తారేమో ఇక చూడాల్సి ఉంది. 


మహేష్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తే చాలా బాగుంటుందని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.పైగా వీరిద్దరూ కూడా అన్నదమ్ముల్లాగా వుంటారు. తారక్ మహేష్ ని అన్నా అని పిలుస్తాడు. అలాగే మహేష్ కూడా తారక్ ని తమ్ముడు అని అంటాడు.సీనియర్ ఎన్టీఆర్ ఇంకా కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఎన్టీఆర్ ఇంకా చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తారక్ ఇంకా మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాను మించి రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కూడా చెప్పవచ్చు. యస్ యస్ రాజమౌళి ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: