ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోతున్న పరిస్థితులలో దేశంలోని టాప్ హీరోలు అంతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఆలోచనలు మటుకు ‘కేజీ ఎఫ్ 3’ పై ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


అయితే ఈమూవీ స్క్రిప్ట్ పూర్తి కావడానికి చాలసమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈలోపు ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’ పూర్తి చేసి ఆతరువాత జూనియర్ మూవీని పట్టాలు ఎక్కించే మాష్టర్ ప్లాన్ లో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. తన మూవీల ప్రమోషన్ విషయంలో ప్రశాంత్ నీల్ కు ఒక డిఫరెంట్ టెక్నిక్ ఉంది. తన మూవీ టైటిల్ పోష్టర్ ను రిలీజ్ చేసిన నాటి నుండి తన మూవీ పై అత్యంత భారీ అంచనాలు పెంచేలా వ్యూహాలు రచించడం ప్రశాంత్ నీల్ అలవాటు.


ఇప్పుడు జూనియర్ తో వచ్చే ఏడాది మొదలుపెట్ట బోతున్న సినిమా విషయంలో కూడ అదే గేమ్ ప్లాన్ ప్రశాంత్ నీల్ రిపీట్ చేస్తున్నాడు. ఈమూవీకి ‘అసుర’ అన్న టైటిల్ ను పెట్టే విధంగా ప్రశాంత్ నీల్ ఆలోచనలు ఉండటంతో ఈ టైటిల్ విషయమై ప్రస్తుతం అతడు తారక్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.


అయితే వచ్చే సంవత్సరం ప్రారంభం అయ్యే మూవీకి అప్పుడే టైటిల్ ను అధికారక ప్రకటన ఎందుకు అన్న జూనియర్ సలహాతో ప్రశాంత్ నీల్ వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి తన టైటిల్ ప్రకటించే విధంగా వ్యూహాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈమూవీ టైటిల్ తారక్ అభిమానులకు విపరీతంగా నచ్చడంతో  ప్రశాంత్ నీల్ ఈసినిమాకు సంబంధించి తన గేమ్ ప్లాన్ లో మొదటి అడుగులోనే విజయం సాధించినట్లు కనిపిస్తోంది. దీనితో జూనియర్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్న విషయమై అన్ని వర్గాలలోను ముఖ్యంగా జూనియర్ అభిమానులలో ఎక్కువ ఆశక్తి కనపరుస్తున్న పరిస్థితులలో జూనియర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: