టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరైన సిద్దు జొన్నలగడ్డ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకొన్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ,  ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల , మా వింత గాధ వినుమా సినిమాలతో మంచి ప్రశంసలను అందుకున్నాడు. కృష్ణ అండ్ హిస్ లీల , మా వింత గాధ వినుమా సినిమాలు నేరుగా 'ఓ టి టి' లో విడుదలయ్యాయి.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా డీజే టిల్లు సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ మేనరిజం , బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ అన్ని కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని సాధించింది.  ఇలా డీజే టిల్లు సినిమా మంచి విజయం సాధించడంతో సిద్ధు జొన్నలగడ్డ కి క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ క్రేజీ సినిమా ఆఫర్ లను కూడా ఈ హీరో రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా క్రేజీ మూవీలను కూడా ఈ హీరో రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం...  సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. డీజే టిల్లు మూవీ పై పూర్తి ఫోకస్ పెట్టడం ద్వారా ఇతర  ప్రాజెక్ట్ లను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: