సాధారణంగా చాలామంది ఇంటి దగ్గర ఉంటూనే డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టాలంటే డబ్బు కావాలి ..కాబట్టి మీ దగ్గర డబ్బు లేకపోయినా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ప్రభుత్వం అందించే సహాయక సహకారాలతో మీరు మీ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇకపోతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ఆలోచించేవారికి ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు. ఇక మీకి ప్రభుత్వం సహకారం అందడంతో పాటు ప్రతినెల 80 వేల రూపాయలను ఆదాయం పొందవచ్చు.ఆ వ్యాపారం ఏంటి? ఎలా చేయాలి? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పేపర్ ప్లేట్స్, పేపర్ కప్పుల తయారీ.. ముఖ్యంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించిన నేపథ్యంలో చాలామంది ప్లాస్టిక్ ను వాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పేపర్ తో తయారు చేసే ప్లేట్లు, కప్పులు, గ్లాసులను మీరు తయారు చేసి అమ్మడం వల్ల మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇకపోతే రోజు రోజుకు వీటికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మీరు పేపర్ కప్పుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా లాభం పొందడానికి ఇదే సమయం  కాబట్టి ఇలాంటి వ్యాపారాలతో కచ్చితంగా లాభం వస్తుంది.

ముఖ్యంగా పేపర్ కప్పుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీకు ముద్ర పథకం కింద లోన్ ఇస్తుంది. ఇక మీరు తక్కువ పెట్టుబడి తో పేపర్ కప్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకొని ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఎక్కువ లాభం పొందవచ్చు. ఇక పేపర్ కప్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు,  యంత్రాలు మీకు మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బాటమ్ రీల్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే 75% ముద్ర పథకం కింద లోన్ తీసుకొని కేవలం 25 శాతం పెట్టబడితే..మీరు ఈ వ్యాపారం మొదలుపెట్టి ప్రతి నెల కచ్చితంగా 80 వేల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: