ఎంతటి స్టార్ హీరో అయినా రీఎంట్రీ లో నిలదొక్కు కోవడం అంటే స్టార్ నిలబడడం అంటే మాములు విషయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ చిన్న విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ అగ్ర హీరో గా కొనసాగుతున్నాడు ఇప్పుడు. ఆయన హీరోగా వచ్చిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు మంచి విజ యాన్ని అందుకోవడం తో ఆయన తో సినిమాలు చేయడానికి మునుపటిలా దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. కానీ ఇప్పుడు సినిమాలను పూర్తి చేయకపోవడం జరుగుతున్న నేపథ్యం లో ఆయన కొత్త సినిమా చేస్తాడా అనేది చూడాలి.

ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ సినిమా తప్పకుండా ఉంది అంటున్నారు. కొంతమంది అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది అని కూడా అంటున్నారు. అయితే ఇన్ని వార్తలు హల్చల్ అవుతున్నా సినిమా బృందం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోవడం నిజంగా పవన్ అభిమానులను కోపోద్రిక్తులను చేస్తుంది. ఎందుకు పవన్ కూడా తన తదుపరి సినిమా ల విషయం లో మౌనంగా ఉన్నారని అడుగుతున్నారు. 

ఇంకోవైపు ఆగిపోయిన క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ను ఆయన పూర్తి చేయడానికి సిద్ధం గా ఉన్నారు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధం గా ఉన్నారని అంటున్నారు. ఇంకా కొంతమంది హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటున్నారు. ఈ మూడు సినిమాలలో పవన్ ఏ సినిమా చేస్తున్నాడో తెలీక పవన్ ఫ్యాన్స్ తెగ అయోమయానికి గురవుతున్నారని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చేయబోయే తదుపరి సినిమా ఏంటో అన్న విషయమై ఎవరైనా స్పష్టతను ఇవ్వాలి. లేదంటే పవన్ ఫ్యాన్స్ మరింత గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: