యంగ్ హీరోల కంటే జోరుగా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. రీసెంటుగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న తర్వాత.... బాలయ్య మరింత జోరు పెంచారు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే... ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్.బి.కె 108 సినిమాగా అనిల్ రావిపుడి డైరక్షన్ లో మరో ప్రాజెక్ట్ కు సై అన్న సంగతి తెలిసిందే. మాములుగా బాలయ్యకు వయసు ఎక్కువ అవుతుండడంతో ఆయనతో నటించడానికి ప్రస్తుతం మంచి వయసు మరియు ఫామ్ లో ఉన్న హీరోయిన్ లు సుముఖంగా లేకపోవడంతో, హీరోయిన్ ల కోసం తెగ వెతుకుతున్నారు. అందుకే టాలీవుడ్ ను వదిలేసి ఇతర ఇండస్ట్రీల మీద పడ్డారు.

అలా వెతికి ఈ చిత్రం లో బాలయ్య కు జంటగా.... మళయాళ భామ హనీ రోజ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య కి మొదటి హీరోయిన్ గా తమన్నాని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు.  కాగా ఇందులో
సెకండ్ హీరోయిన్ కోసం హాని రోజ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈమె ప్రస్తుతం మళయాళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.  కాగా తెలుగులో ఇదే తన మొదటి సినిమా. తమిళంలో కూడా 'పట్టాం పూచి' అనే చిత్రం లో హీరోయిన్ గా చేస్తోంది హనీ రోజ్.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ప్రీ షూటింగ్స్ లో బాలయ్య తో స్టెప్పులు వెస్తోందట హాని రోజ్.

ఇదే విధంగా అఖండ లో బాలకృష్ణ కు జోడీగా నటించి సక్సెస్ ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. ఈ విజయంతో ఈమె మరిన్ని ఆఫర్ లను అందుకుంది. అదే విధంగా హానీ రోజ్ కూడా ఈ సక్సెస్ తో టాలీవుడ్ లో నిలిచిపోతుందా అన్నది చూడాలి.. ఇక బాలయ్య 108 సినిమాకు అనిల్ రావిపుడి భారీ గానే ప్లాన్ చేశారట. అంతేకాదు ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కామెడీ యాంగిల్ ను కూడా బాగా పెంచారట.

మరింత సమాచారం తెలుసుకోండి: