యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని కెరీర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అలా కెరియర్ లో మొట్ట మొదటి సారి ది వారియర్ మూవీ లో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై రామ్ పోతినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మంచి అంచనాల నడుమ ఈ సినిమా జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజే మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది. అలా ది వారియర్ మూవీ మొదటి రోజే మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ కలెక్షన్లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ది వారియర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 5.44 కోట్లు , సీడెడ్ : 2.88 కోట్లు , యూ ఏ : 2.27 కోట్లు , ఈస్ట్ : 1.26 కోట్లు , వెస్ట్ : 1.12 కోట్లు , గుంటూర్ : 1.87 కోట్లు , కృష్ణ : 90 లక్షలు , నెల్లూర్ : 61 లక్షలు .
వారం రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ది వారియర్ మూవీ 16.35 కోట్ల షేర్ ,  25.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 95 లక్షలు .ఓవర్ సీస్ లో : 62 లక్షలు .తమిళ్ లో  దాదాపుగా 1.10 కోట్లు .వారం రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ 19.02 కోట్ల షేర్ ,  32.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: