దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికే మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 11 వందల కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి ఎన్నో కొత్త కొత్త రికార్డ్ లను బాక్సా ఫీస్ దగ్గర సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలా మార్చి 25 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషల్లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మరి కొన్ని రోజుల్లో జపాన్ లో కూడా విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.  

ఆర్ ఆర్ ఆర్ మూవీ ని జపాన్ లో అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్  ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ లో ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో అజయ్ దేవ్ ,  శ్రేయ , సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా ,  డి వి వి దానయ్య ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr