యువ సామ్రాట్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించడానికి సిద్ధమయ్యాడు.ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో కీలకపాత్రలో నటించిన నాగచైతన్య తాజాగా సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే నాగచైతన్య పలు ప్రమోషన్స్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమాలో హీరో అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో నాగచైతన్య నటించాడు.అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య సమంత గురించి కూడా మాట్లాడడం జరిగింది.ఇక సమంతతో సినిమాలలో అవకాశం వస్తే..మీరు కలిసి నటించే అవకాశం ఉందా ? అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ఇంకా చైతన్య గట్టిగా నవ్వేశాడు. ఇక ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో కూడా నాకు అసలు తెలియదు. అది ఈ ప్రపంచానికే తెలియాలి అంటూ నాగచైతన్య సమాధానం ఇచ్చారు.


వీరు కలిసి వస్తే చూడాలని వీరి అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా నాగచైతన్య థాంక్యూ సినిమా ద్వారా చాలా పెద్ద డిజాస్టర్ ను మూటకట్టుకున్నాడు. ఇకపోతే బంగార్రాజు ఇంకా లవ్ స్టోరీ వంటి సినిమాలకు మంచి విజయాలను సొంతం చేసుకున్న నాగచైతన్య.. ఇలా థాంక్యూ సినిమా డిజాస్టర్ కావడంతో కొంచెం డల్ అయ్యాడు.ఇకపోతే తాజాగా చైతన్య అభిమానులు లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరి లాల్ సింగ్ చడ్డా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగచైతన్య త్వరలోనే అవకాశం వస్తే బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కి పిలుపు వస్తే ఖచ్చితంగా వెళ్తాను అంటూ ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడించడం జరిగింది. మరి ఆయన నిజంగానే ఆ షో కి వెళ్తే సమంత గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: