టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన కథలకు క్రేజ్ అనేది బాగా పెరిగింది. ఇక చాలామంది యంగ్ హీరోలు కూడా తమ ప్రతీ సినిమా కోసం ఎన్నో వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవడానికే చాలా ఇష్టపడుతున్నారు.అందులో ఇక ఖచ్చితంగా ఒకరు యంగ్ హీరో నిఖిల్. చాలాకాలం పాటు ఫ్లాపుల్లో ఉన్న నిఖిల్‌కు లైఫ్ ఇచ్చింది ఇలాంటి డిఫరెంట్ కథలే. అందుకే అప్పటినుండి కూడా నిఖిల్ కమర్షియల్ సినిమాలకు దూరమయ్యి.. అందరిలా కాకుండా డిఫరెంట్ కథలకు దగ్గరయ్యాడు. అలాంటి ఒక సినిమానే ఈ 'కార్తికేయ 2' కూడా.ఇక నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'కార్తికేయ'. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి పేరుతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని టీమ్ ఎప్పుడో ప్రకటించినా కానీ అది ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం ఇంతకాలం పట్టింది. షూటింగ్ ఇంకా విడుదల తేదీ.. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఆగస్ట్ 12 వ తేదీన మూవీ రిలీజ్ ఖరారు చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ డేట్‌లో కూడా మార్పు వచ్చేసింది.


ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కావాల్సిన కార్తికేయ 2 సినిమా .. ఆగస్ట్ 13 వ తేదీకు పోస్ట్‌పోన్ అయినట్టు మూవీ టీమ్ ప్రెస్ మీట్‌లో ప్రకటించింది. ఇప్పుడు ఈ ఒత్తిడి కారణంగా తమ రిలీజ్ డేట్‌ను మార్చుకుంటూ రావాల్సి వచ్చిందని ఇంకా దాని వల్ల తాను చాలా బాధపడ్డానని వెల్లడించిన నిఖిల్.. మరోసారి ఇక ఈ విషయంపై స్పందించాడు. ఎందుకు అసలు ఇన్నిసార్లు ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది అని ప్రశ్నకు.. ప్రతీసారి మమ్మల్నే తగ్గమంటున్నారు అంటూ నిఖిల్ చాలా నిరాశగా సమాధానం ఇచ్చాడు. కానీ నిఖిల్ కి నెటిజన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిన ఖచ్చితంగా అందరిస్తామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఆదరిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: