నిన్న విడుదలైన ‘బింబిసార’ ‘సీతా రామం’ రెండు సినిమాలకు టోటల్ పాజిటివ్ టాక్ రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ రెండు సినిమాలు ఒక దానిపై ఒకటి పోటీగా విడుదలైనప్పుడు ఆ రెండు సినిమాలలో ఎదో ఒక సినిమా ఫెయిల్ అవుతుంది. అయితే ఈవారం విడుదలైన రెండు సినిమాలు హిట్ కావడంతో గత రెండు న్బెలలుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఫెయిల్యూర్ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది.


దీనితో సినిమా బాగుంటే హీరోల ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు అన్నవిషయం మరొకసారి రుజువైంది. ‘బింబిసార’ మూవీకి మాస్ సెంటర్ లో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చితే ‘సీతా రామం’ మూవీ క్లాస్ సెంటర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం అనీ విమర్శకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


అయితే ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఈ రెండు సినిమాలు చెప్పుకోతగ్గ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయలేదు. దీనితో ఇప్పటికే వచ్చిన ఈ పాజిటివ్ టాక్ ను ఎంతవరకు ఈ రెండు సినిమాలకు ఈ వీకెండ్ తరువాత కాసులు కురిపిస్థాయి అన్నవిషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ రెండు సినిమాలకు వచ్చిన పాజిటివ్ టాక్ రీత్యా అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాల రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ రెండు సినిమాలు బడ్జెట్ రీత్యా చిన్న సినిమాలు కావడంతో ఖచ్చితంగా నాలుగు వారాలలో ఈ రెండు సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తాయి. ఇది కాకుండా ఆగష్టు 12 – 13 తేదీలలో అనేక భారీ మీడియం రేంజ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ పోటీని తట్టుకుని ఈ రెండు సినిమాలు ఎంతవరకు నిలబడతాయి అన్న విషయమై భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కళ్యాణ్ రామ్ కోరుకున్న మాస్ హిట్ దుల్కర్ కోరుకున్న పాజిటివ్ ఎంట్రీ ఈ రెండు సినిమాలు వల్ల వారిద్దరికీ వచ్చాయి అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: