విజయ్ దేవరకొండ సినిమాలలో నటించే విధానానికి మాత్రమే కాదు ప్రమోషన్స్ చేసే విధానానికి కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. పెళ్లిచూపులు అనే ఒక సాఫ్ట్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఆ సినిమాకు అంతటి హైప్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ అనే చెప్పాలి. దానికి తోడు కంటెంట్ కూడా బాగా ఉండటంతో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వగలిగింది.

నటుడిగా తనను ఎంత బాగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారో నిజజీవితంలో కూడా విజయ్ దేవరకొండ చేసే పనులను అంతగా రిసీవ్ చేసుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ హీరో లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడంతో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఆయన జోరుగా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్న ఈ హీరో అక్కడ తన సత్తా చాటుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

వేలాదిమంది ప్రేక్షకులు ఈ హీరోని చూడడానికి తరలివస్తున్నారు. తొందరలోనే సౌత్ లో కూడా ఆయన తన ప్రభంజనాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా ను విజయవంతం చేయడానికి ఒక్కడే అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో ఏ పాన్ ఇండియా హీరో కూడా ఈ విధంగా తన సినిమాకు ప్రమోషన్ చేసింది లేదు. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ వైస్ గా ఎంతో కష్టపడుతున్నాడని చెప్పాలి. మరి విజయాన్ని అందుకొని ఎన్నో రోజులు అయిపోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటాడో అనేది చూడాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ మరియు చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: