ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలోని దర్శకులకు నిర్మాతలకు తమ సినిమా పట్ల కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది అని చెప్పాలి. ఈ విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తమ సినిమాల పట్ల ఉండడంతో వారి సినిమాల యొక్క ఫలితాలు దారుణంగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోయాయి. దాంతో ఈ సినిమాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. ఆ విధంగా ఆ తర్వాత వచ్చిన సినిమాల విషయంలో దర్శకులు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడంతో ఆ సినిమాల ఫలితాలు కూడా బాక్సాఫీస్ వద్ద అందరిని నిరాశ పరిచాయి.

అయితే ఈ విధంగా నిరాశపర్చిన చాలా సినిమాలలో ఒక కామన్ పాయింట్ దాగి ఉంది. తమ సినిమాల పట్ల అతి నమ్మకంతో వారికి వచ్చిన బంగారం లాంటి అవకాశాలను వారు చేయిదార్చుకున్నారు. అవే ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఈ సినిమాలకు మంచి బిజినెస్ వచ్చింది. అయితే థియేటర్లలో ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ లాభాలను పొందవచ్చు అని చెప్పి అక్కడ ఈ సినిమాలను ఇవ్వకుండా డైరెక్ట్ గా విడుదల చేశారు. దాంతో ఆ సినిమాలకు క్రేజ్ తగ్గిపోవడంతో చాలా తక్కువకు ఓటీటీ కి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ విధంగా తమ సినిమాల పట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం నిజంగా పెద్ద మైనస్ అనే చెప్పాలి.

నమ్మకం ఉండడం వరకు బాగానే ఉంటుంది కానీ అతో నమ్మకం ఉంటే కూడాను కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. ఇది రాబోయే భవిష్యత్తులో చేయబోయే పెద్ద నిర్మాతలకు ఒక గుణపాఠం లాంటిది అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చాలా చిత్రాలే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు మంచి విజయం సాధించాలంటే తప్పకుండా కంటెంట్ బాగా ఉండాలి. లేదంటే వాటికి ముప్పు పొంచి ఉంటుంది. అయితే కంటెంట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా సదరు దర్శక నిర్మాతలు ఓ టీ టీ వెళ్లిపోవడమే మంచిది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT