సినీ కార్మికులకు వేతనాలు పెంచుతూ తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సినీ కార్మికులతో నిర్వహించిన నిర్మాతల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచాలని నిర్ణయించింది.

అయితే ఏది చిన్న సినిమా? ఏది పెద్ద సినిమా? అనే విషయాన్ని చలన చిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ల తో కూడిన కమిటీ నిర్ణయించనుంది. పెంచిన జీతాలు ఈ ఏడాది జులై 1 నుంచి 2025 జూన్‌ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. వేతనాలు పెంచాలంటూ గత మూడేళ్లుగా సినీ కార్మికు లు పోరాడుతున్న సంగతి తెలిసిందే.

గతంలోకి వెళితే..

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు జూన్ 22న ఉదయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
జూన్ 22న ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు.. కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. సినీ కార్మికులు అడిగిన దానికంటే 12శాతం అధికంగా ఇస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకు లు అప్పట్లో చెప్పారు.
షూటింగ్ లు ఆగకూడదనే సదుద్దేశంతో ఎవరు ఎక్కువ వేతనం ఇస్తారో.. వాళ్ల షూటింగ్ లకు వెళ్తామని ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనే ని అనిల్ జూన్ 22న స్పష్టం చేశారు.
ఇక వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో సినీ కార్మికు లు జూన్ 23న ఆందోళనను విరమించారు.
సినీ కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేస్తున్నట్లు జూన్ 23న నిర్మాతల మండలి ప్రకటించింది.
జూన్ 24న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
కార్మికు ల సమస్యల ను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని, వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకారం తెలపడంతో సినిమా చిత్రీకరణలు యథాతథంగా జరుగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు అప్పట్లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: