డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన భారీ కథ, బడ్జెట్ సినిమా త్రిపుల్ ఆర్ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందొ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఈ సినిమా లొని ప్రతి పాట చరిత్రను తలపించేలా ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది.



ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలోని ప్రతి పాట ఆణిముత్యాలే. నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌ లో కేక పెట్టించగా, కొమురం భీముడో అంతకు మించి అన్నట్టుగా సాగింది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా కీరవాణీ కొడుకు భైరవ పాడారు. అదిరి పోయింది.. కాగా, ఈ పాట చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు ట్రాన్స్‌ లోకి వెళ్లి పోతారు. ఈ పాట తో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మొత్తం చూపించాడు.



ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ చూపించిన హావ భావాలు చూసి కంటతడి పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ సాంగ్ ఇప్పటికీ ఏదో ఒక మూల ఏదో ఒక విధంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన కొత్త వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ కొమురం భీముడో పాటకు డైరీ మిల్క్ యాడ్లోని కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్ సాంగ్‌ని మిక్స్ చేసిన ఎడిటింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు స్పందిస్తూ సాంగ్‌కు ఎన్టీఆర్ లిప్ మూవ్‌మెంట్ కరెక్ట్ గా సింక్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఈ సినిమా ఎన్టీఆర్ పాత్ర ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. ఇప్పుడు వరుస సినిమాలతో ఎన్టీఆర్ బిజిగా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: