ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కొరటాల శివ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అప్పటిదాకా ఆయనతో సినిమా చేయాలని ఆయన చుట్టూ తిరిగిన హీరోలందరూ కూడా కొరటాల శివను పట్టించుకోవడం మానేశారు. నిజంగా కొరటాల శివ ఆచార్య సినిమా తెరకెక్కించిన విధానాన్ని చూసి వారు ఎంతో భయపడిపోయారు అని చెప్పాలి. వరుసగా నాలుగు సినిమాలను విజయ పథం లో నడిపించిన దర్శకుడైన కొరటాల శివ నేనా ఈ సినిమాను తీసింది అని అనుకునేలా ఆచార్య సినిమాను చేశాడు.

ఆ విధంగా ఆ ఫ్లాప్ తాలూకు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కొరటాల శివ ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఇంత మంచి డైరెక్టర్ ఈ విధంగా అయిపోవడం పట్ల వారు ఎంతో బాధపడ్డారు.  ఫైనల్ గా ఈ ప్రభావం నుంచి మెగా హీరోలు అందరూ కూడా ఆయనను బయటికి తీసుకురావడం నిజంగా వారి మంచితనానికి నిదర్శనంగా చూపుతుంది. ఏదేమైనా కొరటాల శివ మళ్లీ మంచి కమ్ బ్యాక్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

కొరటాల శివ ఇప్పుడు ఎన్నో అనుమానాల మధ్య ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమా యొక్క చిత్రీకరణ చేపడుతున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ జరిగినా ఈ సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు చాలావరకు ఆయనతో సినిమా చేయద్దు అని ఎన్టీఆర్ కు విన్నపాలు చేసుకుంటున్న వేళ కొరటాల శివ ఆయనతో ఎలాంటి సినిమాను చేసి తనను తాను మళ్ళీ నిరూపించుకుంటాడో చూడాలి. ఎన్టీఆర్ కూడా కొట్టాల శివ పై పూర్తి నమ్మకం పెట్టుకుని ఈ సినిమాను చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే ఓ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కాంబో వస్తుంది కాబట్టే ఎన్టీఆర్ అభిమానులకు ఇష్టం లేకున్నా కూడా ఒప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని కొరటాల శివ కాపాడుతుండా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: