సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎన్నో హిట్ చిత్రాలను కనిపించి అందరికి తెగ ఆకట్టుకుంటోంది.. స్టార్ హీరో లతో అందరితో జత కట్టింది.అయినా బాగానే ఉన్న సమయంలో ఇప్పుడు సామ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. మయోసైటిస్ అనే ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మూడో దశలో ఉన్న మయోసైటిస్`తో పోరాడుతున్న సమంత కోలుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం..


చికిత్స నేపధ్యంలో సినిమాలు మొత్తం ఆపేసింది. కాగా ఒకపక్క చికిత్స తీసుకుంటూనే మరోపక్క సోషల్ మీడియాలో అభిమానులతో సామ్ టచ్ లో ఉండటం జరిగింది. ఇదిలా ఉంటే “మయోసైటిస్” ట్రీట్మెంట్ విషయంలో సమంత మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఫిజియోథెరపీ ఇంకా ఇంగ్లీష్ మందుల ట్రీట్మెంట్ ఆపేసి… ఆయుర్వేదిక్ చికిత్స తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చికిత్స విధానం విషయంలో లేటుగా అయినా ఆయుర్వేదిక్ గట్టిగానే పని చేస్తది. కానీ ఫలితం కోసం చాలా నెలలు వేచి చూడాలి. దీంతో ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల షూటింగ్స్.. మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అభిమానులు శోకసంద్రంలో ఉంటున్నారు.

ఆయుర్వేద బదులు ఇంగ్లీష్ మందుల ట్రీట్మెంట్ చాలా బెస్ట్ అని… ఆల్రెడీ సగం ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వలన సామ్ కు ఏమైనా అవుతుందని ఆందోళన చెందుతున్నారు.యశోద” నవంబర్ 11వ తారీకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాగా… సూపర్ డూపర్ హిట్ అయింది. 40 కోట్ల బడ్జెట్ తో… తెరకెక్కిన ఈ సినిమా… భారీ లాభాలు సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “శకుంతలం” విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ హీరోగా… సమంత హీరోయిన్ గా “ఖుషి” సినిమా కూడా రిలీజ్ కావలసి ఉంది. ఈ రెండు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: