శ్రీలీల నటించిన ‘పెళ్ళిసందడి’ ఫెయిల్ అయినప్పటికీ ఆమెకు ఎక్కడ అవకాశాలు తగ్గకపోవడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈరోజు విడుదలకాబోతున్న ‘ధమాకా’ మూవీ ఫలితం శ్రీలీల కెరియర్ కు చాల కీలకం. 54 సంవత్సరాల వయసు ఉన్న రవితేజా పక్కన 22 సంవత్సరాల వయసు ఉన్న శ్రీలీల మంచి పెయిర్ గా పేరు తెచ్చుకోగలిగితే ఆమెకు సీనియర్ హీరోల పక్కన కూడ నటించే అవకాశం ఉంది.


‘ధమాకా’ మూవీ షూటింగ్ కోసం శ్రీలీల విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ లో చిత్రీకరించవలసిన ఒక పాటకు సంబంధించిన కాస్ట్యూమ్ బ్యాగ్ శ్రీలీల అజాగ్రత్త వల్ల పోయిందట. షూటింగ్ రేపు ప్రారంభం అవుతుంది అనగా తన బ్యాగ్ పోయిన విషయాన్ని గుర్తించిన శ్రీలీల ఆవిషయాన్ని ఆసినిమా దర్శక నిర్మాతలు చెప్పడంతో వారు షాక్ అయి ఆసినిమా షూటింగ్ స్పాట్ కు బాగా దూరంలో ఉన్న మార్కెట్ కు మూడు గంటలు ప్రయాణించి వెళ్ళి నానాపాట్లు పడి తిరిగి తన పాటకు సంబంధించిన డ్రస్ ను రెడీ పెట్టారట.


ఈవిషయం రవితేజాకు తెలియడంతో అతడికి కోపం వస్తుందని తాను  భయపడినప్పటికీ అతడు నవ్వుతూ తనవంక చూసిన విషయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను అంటోంది. ఆపాట చిత్రీకరణ సమయంలో రవితేజా కాలికి దెబ్బతగలడంతో పాదానికి కుట్లు వేసినా ఆనొప్పిని భరిస్తూ నటించిన మాస్ మహారాజా డెడికేషన్ తనకు ఎంతో స్పూర్తిని ఇచ్చింది అని అంటోంది.


ప్రస్తుతం తాను సినిమాలలో నటిస్తున్నప్పటికీ తాను చదువుతున్న మెడిసెన్ పూర్తిచేసి తీరుతానని రవితేజా లాంటి సీనియర్ లు అంత కష్టపడుతుంటే తాను ఎందుకు కష్టపడకూడదు అన్న నిర్ణయంలో తాను ఉన్నట్లు చెపుతోంది. శ్రీలీల లానే సాయి పల్లవి కూడ డాక్టర్ అయితే సినిమాల హడావిడిలో ఆమె మెడిసెన్ చదువు కూడ పూర్తి కాలేదు అని అంటారు. మరి శ్రీలీలకు రవితేజా స్ఫూర్తి అయితే సాయి పల్లవికి ఎవరు స్ఫూర్తి అవుతారో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: