ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తన నటనతో ... డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకొని ... దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు.

మూవీ ని కొన్ని రోజుల క్రితమే రష్యా లో చిత్ర బృందం విడుదల చేసింది. రష్యా లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా అల్లు అర్జున్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి సురేందర్ రెడ్డి ఒక కథను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ఇప్పటికే సైరా నరసింహారెడ్డి అనే పను ఇండియా మూవీ కి దర్శకత్వం వహించగా ... ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: