సీనియర్ హీరోయిన్స్ పెళ్ళి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకు దూరమయి సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసి కొంతకాలానికి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే నదియా, ఖుష్భు, టబు లాంటి వాళ్ళు త్రివిక్రం వంటి స్టార్ డైరెక్టర్స్ సినిమాల ద్వారా మంచి పాత్రలతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వాస్తవంగా అయితే సినిమా యాక్టర్లకు గతంలో అవకాశాలు తగ్గిన తర్వాత ఇక నటనపరంగా చేసేందుకు ఏమీ ఉండేది కాదు. అయితే గతకొన్నేళ్ళుగా ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. టీవీ ఛానల్స్, వెబ్ సీరీస్ రంగంలో అవకాశాలు రావడంతో సీనియర్ నటీనటులు గతంలో లాగా ఖాళీగా ఉండడం లేదు. ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. రీసెంట్ గా సీనియర్ హీరోయిన్ మీనా కూడా ఈ లిస్ట్ లో చేరింది. 

మీనా ఒక తమిళ కామెడీ థ్రిల్లర్ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. 'కారోలిన్ కామాక్షి' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈమధ్యే ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో మీనా ఒక తమిళ బ్రాహ్మణ స్త్రీ పాత్రలో నటిస్తుందని కోలీవుడ్ మీడియా సమాచారం. చూసేందుకు మహా డీసెంట్ గా ఉన్నప్పటికి నోరు తెరిస్తే మాత్రం పచ్చి బూతులతో విరుచుకు పడుతుందట. మీనాకు మొదటి నుంచి డీసెంట్ యాక్ట్రెస్ గా మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు తన కెరీర్ లో బోల్డ్ పాత్రలు నటించడం ఎప్పుడూ చేయలేదు. దీంతో మీనా అభిమానులు ఈ పాత్ర చూసి షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

ఈ వెబ్ సీరీస్ లో మీనాతో పాటుగా జార్జియా ఎంజెలీనా.. ఆంటో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ తమిళ నటుడు వివేక్ ఈ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేశాడు. జీ5 లో ఈ వెబ్ సీరీస్ డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. కారోలిన్ కామాక్షి తో మీనా మరోసారి నటిగా బిజీ అవుతారేమో చూడాలి. ఇక ఈ వెబ్ సిరీస్ తో మళ్ళీ టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు సంపాదించుకుంటుందేమో కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది. ఒకప్పుడు మీనా టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రజనీ కాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన మీనా నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: