ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ కు హీరోలే దొరకడం లేదు. టాలీవుడ్ ని బాలీవుడ్ ని షేక్ చేసిన సెన్సేషన్ క్రియేటర్.. ఏ స్టార్ డేట్స్ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. బీటౌన్ హ్యాండిచ్చినా.. టాలీవుడ్ స్టార్స్ ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు మహేశ్ బాబు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ హ్యాండిచ్చాడు. 

 

ఒకే సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ లో దర్శకుడు సందీప్ వంగా సెన్సేషన్ హిట్ కొట్టాడు. శివకు ముందు శివ తర్వాత అనే టాలీవుడ్ ని.. అర్జున్ రెడ్డికి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అని మాట్లాడుకునేలా చేశాడు. ఇదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ వంగా ఫేట్ ఓవర్ నైట్ లో మారిపోయింది. కట్ చేస్తే విజయ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. సందీప్ వంగా బాలీవుడ్ చెక్కేశాడు. 

 

సెన్సేషన్ హిట్స్ అయితే కొట్టాడు గానీ.. సందీప్ వంగాకు ఛాన్స్ లు లేకుండా పోయాయి. బాలీవుడ్ లో సెట్ అవుతాడనుకున్న సందీప్ ని అక్కడి స్టార్స్ పట్టించుకోవడమే లేదు. కబీర్ సింగ్ తర్వాత రణబీర్ కపూర్ తో సినిమా అనుకుంటే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. ఇక అంతకు ముందు మహేశ్ బాబు ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇపుడు సైలెంట్ అయ్యాడు. ఈ లోగా ప్రభాస్ తో సినిమా చేద్దామని ట్రై చేస్తే ప్రభాస్ హ్యాండ్ ఇచ్చాడు. 

 

రీసెంట్ గా సందప్ వంగా ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు వినిపించింది. కానీ ఊహించని విధంగా ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఇప్పుడు సందీప్ వంగా ఏ స్టార్ ఖాళీగా ఉన్నాడా.. అని సర్చింగ్ లో ఉన్నాడట. ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడికి స్టార్స్ దొరకడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. మరి సందీప్ వంగా తర్వాత ఏ స్టార్ పై ఫోకస్ చేస్తాడో ఏమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: