తెలుగు టెలివిజన్ రంగంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ యాంకరింగ్ చేసే యాంకర్లలో ఒకరు ప్రదీప్. ఈటీవీ మరియు జీ తెలుగులో ప్రముఖ షోలలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ప్రదీప్ అలరిస్తున్నారు. ఎక్కువగా అమ్మాయిలు ప్రదీప్ యాంకరింగ్ అంటే పడిచస్తారు. అటువంటిది ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమారంగంలోకి ప్రదీప్ ఇటీవల అడుగు పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా అనూప్ రూబెన్స్ సంగీతంలో  “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమా చేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.

 

సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టక ముందే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమాలకు సంబంధించి రిలీజైన పాటలకి 24 గంటలు తిరగక ముందే మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లక్షల్లో లైక్స్ వచ్చేస్తున్నాయి. తన మొట్టమొదటి పాట నీలి నీలి ఆకాశం పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక అలాగే ఇటీవల కాజల్ చేతుల మీదగా విడుదల చేయించిన మీకో దండం సాంగ్ కూడా 24 గంటలు తిరగక ముందే దగ్గరగా 1.7 మిలియన్ వ్యూస్ మరియు లక్ష దగ్గర లైక్స్ ను రాబట్టేసింది.

 

అంతేకాకుండా టాప్ 8 ట్రెండింగ్ లో కూడా నిలిచింది. సినిమా సాంగ్స్ పరంగా అంతా ఓకే అయినా గాని….వెండితెరపై ఏమాత్రం తేడా పడినా ప్రదీప్ యాంకరింగ్ కి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అనవసరంగా ప్రదీప్ సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెట్టి రిస్క్ చేస్తున్నాడని కొంతమంది ఇండస్ట్రీలో వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సుడిగాలి సుదీర్ ఈ విధంగానే సినిమా రంగంలో అడుగుపెట్టి చేతులు కాల్చుకుని ఇక సినిమాలకు దండం పెట్టేసాడు...ఆ స్థాయి రాకముందే ప్రదీప్ తన యాంకరింగ్ రంగంలో గతంలో మాదిరిగా రాణిస్తే బాగుంటుందని చాలా మంచి సూచనలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: