టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అనుష్కకకి మాత్రం చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకు కారణం ఆమె నటించిన పాత్రలు అటువంటివి. మరి అంత గొప్ప పాత్రల్లో నటించిన ఆమె సినీ కెరియర్ నిన్నటికి దాదాపు 15ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఆమెను అభినందించడానికి అగ్ర దర్శకనిర్మాతలు వచ్చి వాళ్ళ ఆశీస్సులను అందజేశారు. అంతేకాక చాలా గ్యాప్ తర్వాత అనుష్క నిశబ్దం అనే చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ఏప్రిల్2న విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోనావెంకట్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాస్త లావు అయింన్న దాని పై కొంత కాలం ఆమె ట్రీట్మెంట్ కారణంగా కొంత సినిమాలకు గ్యాప్ వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్లో అనుష్క క్రేజ్ వేరనే చెప్పాలి.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ముందుగా స్వీటీకి హ్యాపిబర్త్డే టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సినీ కెరియర్. నేను ఫస్ట్ స్వీటీని ఎక్కడ చూశానంటే అదొక ఎక్స్పీరియన్స్ పూరి. రామదాస్ సినిమా తీస్తున్న సమయంలో నాగార్జున గెస్ట్ హౌస్‌కి వెళ్ళాను అక్కడ అనుష్క ఉంది. అప్పుడు నాగార్జున డైరెక్టర్‌గారు టైమ్‌కి వచ్చారు. మీకు ఒక కొత్త హీరోయిన్ని చూపించాలి అన్నారు. స్వీటీ అని నాగార్జున పిలవగానే కింద నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వచ్చింది. మెట్లు ఎక్కి వచ్చి అలా నిలబడగానే చూడగానే ఒక మాట అన్నా. నువ్వు సౌత్ ఇండియాలో ఒక టాప్ హీరోయిన్ అవుతావ్ అన్నాను.ఈ రోజు ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఎలాగైతే మెట్లు ఎక్కి వచ్చావో నువ్వు ఎక్కిన ప్రతి మెట్టు అద్భుతమైన గోల్డెన్ మెట్లని చెప్పాలి. ఫస్ట్ పిక్చర్లో పూరి కాంబినేషన్లో వచ్చింది. ఇక పూరి హీరోయిన్లని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ సినిమాలోనే సూపర్ అనిపించావ్. తర్వాత స్యామ్ సినిమాలో గజకేశ్వర యోగం పట్టేసింది నీకు ఏనుగు ఎక్కేశావ్ అప్పుడే. భాగమతి, ఆ తర్వాత గుణశేఖర్ చిత్రంలో రుద్రమదేవిగా... ఇక బాహుబలిలో దేవసేనగా హంస వాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయావ్ అలాగే మళ్ళీ తల్లిగా ఊపిరి పీల్చుకో అన్న ఒక్క మాటతో దద్దరిల్లిపోయింది బాహుబలిలో అండ్ ఫైనల్‌గా నా సినిమాలో వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా చేశావ్. చాలా మందికి ట్రై చేస్తే సినిమాలు దొరుకుతియి కాని నీ విషయంలో మాత్రం క్యారెక్టర్స్ అన్నీకూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం ఈ జనరేషన్లో ఉన్న ఏ హీరోయిన్‌కి ఆ అదృష్టం దక్కలేదు.
ఒక దీనికి కారణం అందరూ చెప్పేది అనుష్క చాలా మంచిది అని అంటుంటారు. ఆఫీస్ బాయ్ కూడా చెపుతాడు అనుష్క మంచిది అని. ఆ క్వాలిటీ నీలో ఉండటమే కాకుండా ఇలాంటి పాత్రలు రావడంతో ఇంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించడం నీ జన్మ ధన్యం. అది అందరూ అనుకుంటే వచ్చేది కాదు. ఫైనల్‌గా నాకు నీకు చాలా దగ్గర పోలికలున్నాయి. అదేమిటంటే నన్ను మౌనముని అని పిలిచేవారు. నువ్వు ఈ నిశబ్దం చిత్రంతో నువ్వు మౌనముని కన్యకగా అయిపోతావు. హేమంత్ ఎప్పుడో చెప్పాడు ఈ సినిమా చాలా బావుంటుంది. లైన్ చాలా బావుంది. ఇక ఈ క్యారెక్టర్ నువు ఎలా చేసుంటావో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు అన్నారు. హేమంత్ కూడా చాలా పెద్ద డైరెక్టర్ నీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.