మాస్ మహారాజా రవితేజ కెరీర్ సినిమా సినిమాకు పాతాళంలోకి వెళ్లిపోతోంది ఇప్పటికే నాలుగు వరుస సినిమాలతో రవితేజ మార్కెట్ పూర్తిగా పతనమయ్యింది జనవరిలో వచ్చిన డిస్కో రాజా సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో అసలు రవితేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు సాహసం చేయలేకపోతున్నారు. గత కొంతకాలంగా రవితేజ మంచి కథా కథనాలు చూసుకోకుండా కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు వరుస సినిమాలు వచ్చి మార్కెట్ పడిపోవడంతో ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని  దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం `క్రాక్`  ఏ మాత్రం రెమ్యూనరేషన్ లేకుండా చేస్తున్నట్టు సమాచారం.

 

సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక లాభాలు వస్తే అప్పుడు రవితేజకు కొంత షేర్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ట. ఇక అటు మలినేని గోపీచంద్ మార్కెట్ సైతం పూర్తిగా దెబ్బతినింది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బలుపు, డాన్ శీను సినిమాలు హిట్ అవడంతో ఇప్పుడు ఆ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి. ఇక ఇటీవ‌లె ఈ చిత్ర షెడ్యూల్ కొంత వ‌ర‌కు పూర్త‌యింది. ఇటీవ‌లె సెట్స్‌లో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు గోపిచంద్‌మ‌లినేని.

 

ఇక ఈ చిత్రం షూటింగ్ కొంత వ‌ర‌కు పూర్త‌వ‌గా మే8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌వితేజ‌కి జోడిగా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం హిట్ అయితే ఇటు హీరో ర‌వితేజ‌తోపాటు చాలా కాలం త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన శృతిహాస‌న్‌కి కూడా లైన్‌లో ప‌డ్డ‌ట్టే అని చెప్ప‌వ‌చ్చే. ఈ చిత్రానికి మ్యూజిక్ త‌మ‌న్ అందిస్తున్నారు. ఇక వీరిద్ద‌రి మ్యాజిక్ తెర మీద ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి. ఆఖ‌రికి రెమ్యూన‌రేష‌న్ కూడా లేకుండా చేస్తున్న ర‌వితేజ‌కి ఈ సినిమా మంచి ఫ‌లితాన్నివ్వాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ కోరుకుంటున్నారు. ఒక‌వేళ ఈ సినిమా ఏమాత్రం అటూ ఇటూ అయినా ఇక ర‌వికి సోలో హీరోగా క‌ష్ట‌మే మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: