కరోనా ఎఫెక్ట్ తో వ్యవస్థలు అన్నీ కామ్ అయిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. కరోనా చేస్తున్న నష్టం ఒకెత్తయితే.. దీని వల్ల ప్రజలు కుటుంబాలతో గడుపుతున్నారు. పొగ కాలుష్యం తగ్గడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రశాంత వాతావరణం కనబడుతోంది. అయితే.. ఇటువంటి విపత్కర సమయంలో జరుగుతున్న మంచి పరిణామాలను కొందరు సెలబ్రిటీలు వివరిస్తున్నారు. ఈ తరహాలోనే ప్రకృతికి, మనిషికి జరుగుతున్న మేలుపై మెగాస్టార్ చిరంజీవి మనవరాలు కూడా ఓ వీడియోలో తన అభిప్రాయాలు చెప్పింది.

 

 

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెద్ద కుమార్తె.. ప్రకృతి గురించి చెప్తున్న మాటలను వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు మెగాస్టార్. ‘కరోనా ప్రభావానికి వాతావరణ కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన గాలి అందుతోంది. వాతావరణంలోని వేడి తగ్గి చల్లదనం వస్తోంది. దీంతో మనుషులు, జంతు జీవజాలాలు స్వేచ్ఛగా ఉంటున్నాయి. ఇందుకు సముద్ర తీరంలో డాల్ఫిన్స్ సాగిస్తున్న స్వేచ్ఛా జీవనమే ఉదాహరణ. దేశ రాజధాని ఢిల్లీలో పొగ కాలుష్యం తగ్గడం కూడా ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆకాశం కూడా ఎంతో నిర్మలంగా కనిపిస్తోంది. ఇకముందు కూడా ప్రజలకు ఇలానే మంచి జరగాలి. స్టేహోమ్, స్టే సేఫ్’ అంటూ ఇంగ్లీషులో చక్కగా వివరించింది.

 

 

నివి తల్లి అని ముద్దుగా పిలుచుకుంటున్న మెగాస్టార్ ఈ విడియోపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ‘ఈ భూమిని, ప్రకృతిని మనం వారసత్వంగా పొందాం. మనం వీటికి సంరక్షకులం మాత్రమే. దీనిని జాగ్రత్తగా మన భవిష్యత్ తరాలకు అందివ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవివైవిధ్యాన్ని కాపాడగలం. నివి తల్లి చెప్తోంది అక్షరసత్యం’ అన్నారు. ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: