టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్ తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయన తో సినిమా చేయడానికి ఇతర సినిమాలను కూడా పక్కన పెట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పుడు కొన్ని విధాలు ఫాలో అవ్వాలని భావిస్తున్నారు. అందుకే అది నిర్మాతలకు దర్శకులకు అసలు నచ్చడం లేదని అంటున్నారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలు కూడా ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి ముందు కు రావడం లేదట. 

 

అసలు స్పష్టంగా తెలియదు గాని మహేష్ కారణంగా ఒక అగ్ర నిర్మాత చాలా ఇబ్బందులు పడ్డారని మహేష్ ని నమ్ముకుని భారీగా పెట్టుబడులు పెట్టారని అంటారు. భారీగా పెట్టుబడి పెట్టినా సరే సదరు నిర్మాతను మహేష్ బాబు ఏ మాత్రం కనికరించలేదు అని టాక్. అందుకే ఇప్పుడు అగ్ర దర్శకులు కూడా మహేష్ తో సినిమా చెయ్యాలి అని చూస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ ని మొత్తం తానే తీసుకోవాలని మహేష్ బాబు భావించడం కొందరికి బాగా ఇబ్బందిగా మారింది అంటారు. అందుకే ఆ నిర్మాత భారీగా పెట్టుబడి పెట్టినా సరే నష్టపోయారు అని అంటారు. 

 

ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. కాని మహేష్ బాబు తర్వాతి సినిమా జక్కన్న తో చేస్తున్నారు. ఆ సినిమాకు మాత్రం నిర్మాత లైన్ లో ఉన్నారు. ఇక్కడ మహేష్ ని నమ్మలేదు అని అక్కడ రాజమౌళిని నమ్మి సదరు నిర్మాత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు అని అంటారు. మరి మహేష్ ఇలాగే ఉంటే కష్టమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: