డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తర్వాత వచ్చిన చందమామ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటించిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుండి కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించింది.

 

అయితే మొన్నటి వరకు కాజల్ చేతిలో సినిమా ఆఫర్లు చాలా తక్కువగా ఉన్నాయి. తెలుగులో ఆమె నటించిన సీత సినిమా ఫ్లాప్ కావడంతో అవకాశాలు రాకుండా పోయాయి. కాజల్ పని అయిపోయిందని, మూట సర్దేసుకుని పోవాల్సిందేనని అన్నారు. కానీ ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్న సినిమాలని చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. అన్నీ భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.

 

మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు సినిమాలో నటిస్తున్న కాజల్ మెగాస్టార్ ఆచార్య సినిమాలో హీరోయిన్ గా అవకాశం పట్టేసింది. ఈ సినిమా కోసం ఆమె చాలా డిమాండ్ చేసిందని టాక్. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ ౨ చిత్రంలోనూ, ముంబైసాగా అనే మరో భారీ చిత్రంలోనూ నటిస్తుంది. అయితే తాజాగా ఆమె చేతికి మరో భారీ అవకాశం వచ్చిందని అంటున్నారు.

 

తమిళ నటుడు విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో తుపాకీ ౨ సినిమా తెరకెక్కబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకోవాలని చూస్తున్నారట. తుపాకీలోనూ కాజల్ హీరోయిన్ గా నటించింది. అందుకే ఈ సినిమాలోనూ ఆమెకి తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఈ అవకాశం దక్కితే కాజల్ నిజంగా అదృష్టవంతురాలే అని చెప్పాలి. కెరీర్ చివరి దశకి వస్తుందనుకున్న టైమ్ లోనూ వరుస అవకాశాలతీ దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: