శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్ అయినటువంటి ముత్తయ్య మురళీ ధరన్ గురించి అందరికీ తెలిసినదే. క్రికెట్ ఆడటంలో అతనిది చాలా భిన్నమైన శైలి. ఇతగాడు తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఇకపోతే మురళీ ధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ పేరిట తమిళంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు తమిళ్ రియల్ స్టార్ విజయ్ సేతుపతి చక్కగా సరిపోతాడని సదరు చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యి, విజయ్ సేతుపతిని కలవగా, విజయ్ కి కథ నచ్చడంతో పచ్చ జెండా ఊపేసాడు.

ఇదిగో అక్కడినుండి వచ్చింది అసలు చిక్కు. తాము ఎంతగానో ఇష్టపడుతున్న హీరో విజయ్ తమకు బద్ద శత్రువు అయినటువంటి ముత్తయ్య మురళీ ధరన్ కథతో సినిమా చేయడం వారికి ఎంతమాత్రమూ నచ్చలేదు. ఈ నేపథ్యంలో తమిళుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ ఆయనకు మురళీ ధరన్ విజ్ఞప్తి చేయడంతో ఇప్పటికే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు.

అయినా, కోపం చల్లారని మొండి తమిళులు విజయ్ సేతుపతి చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులు చేయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ అలాంటి హెచ్చరికలు చేస్తున్న నెటిజన్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తప్పుకున్న అనంతరం కూడా విజయ్ ను ఉద్దేశించి ఈ స్థాయిలో విష పదజాలాలను ప్రయోగించడం సబబు కాదని హెచ్చరిస్తున్నారు.

కాగా.. ఒకప్పుడు తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వాన్ని మురళీ ధరన్ అప్పట్లో సమర్ధించిన సంగతి తెలిసినదే. అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోని తమిళులు మురళీ ధరన్ పైన సినిమా చేసినందుకుగాను తమ అక్కసును విజయ్ పైన తీర్చుకుంటున్నారు. ఇక తాజాగా, సినీ నటి, బీజేపీ నాయకురాలు అయినటువంటి ఖుష్బూ ఈ తంతుపైన స్పందస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడటం ఓ అనాగరిక చర్య అని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: