నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.  ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర ప్రేరణ ఫస్ట్ లుక్ ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేయగా ఆ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అడ్వాన్స్ బ‌ర్త్ డే గిఫ్ట్ వ‌చ్చేసింది. ఈసినిమాలోని ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌ని ప‌రిచ‌యం చేస్తూ.. చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్ వ‌దిలింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ పేరు విక్ర‌మాదిత్య‌. నిజానికి హీరోయిన్ పేరు రాధ‌, హీరో పేరు… శ్యామ్ అనుకున్నారంతా. అలా టైటిల్ జ‌స్టిఫికేష‌న్ చేశారేమో అనుకున్నారు. కానీ.. విక్ర‌మాదిత్య గా ప్ర‌భాస్ ని ప‌రిచ‌యం చేసి ట్విస్ట్ ఇచ్చింది చిత్ర‌బృందం.

ఇక అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది..కరోనా కారణంగానే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు కదల్లేదు.. దాంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ ఐయ్యింది. అయితే ప్రభుత్వం సడలింపులు నేపథ్యంలో తిరిగి షూటింగ్ లు ప్రారంభించారు.. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ విదేశాల్లో ఉండడంతో ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని క్వారంటైన్ లో ఉండి షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టారు..

ఇక ఈ లుక్ లో విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్ అవ‌తారం స్టైలీష్‌గా ఉంది. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ వాతావ‌ర‌ణం, రెట్రో క‌ల‌రింగు, కార్లు.. అన్నీ లుక్ లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌భాస్ పుట్టిన రోజున మోష‌న్ పోస్ట‌ర్ రాబోతోంది. ఇది కేవ‌లం అడ్వాన్స్ గిఫ్టే. అస‌లు గిఫ్టు ముందుంద‌న్న‌మాట‌.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: