ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మన్యం వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఈ రోజు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్, అలాగే టీజర్ రిలీజ్ చేశారు. సినిమాలో అతడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఏ సినిమా లోనూ కనిపించని సరికొత్త గెటప్ లో ఎన్టీఆర్ కనిపించాడు.

“వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా… వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ… వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ! నా తమ్ముడు, గోండు బెబ్బులి… కొమురం భీమ్” అంటూ ఎన్టీఆర్ పాత్రను రామ్ చరణ్ తన వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేశారు.

చరణ్ వాయిస్, డైలాగులు ఎంత వీరోచితంగా ఉన్నాయో… ప్రచార చిత్రం లో ఎన్టీఆర్ లుక్ కూడా అంతే వీరోచితంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో మన్యం ముద్దుబిడ్డ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ముఖ్యంగా టీజర్ లో 53 సెకండ్ల దగ్గర ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ సూపర్బ్ అని చెప్పాలి. కేక పుట్టించాడు. అలాగే టీజర్ చివర్లో ముస్లిం టోపీ పెట్టుకుని సర్వమత సమ్మేళనం సందేశాన్ని ఇచ్చారు.

దర్శకధీరుడు రాజమౌళి టేకింగ్ కూడా సూపర్. టీజర్ ప్రారంభంలో అడవుల్ని, ఆ తర్వాత వర్షంలో చినుకులు పడుతుండటాన్ని చాలా అందంగా చూపించారు. వాడు కనబడితే సముద్రాలు తలపడతాయి డైలాగ్ దగ్గర దానికి తగ్గట్టుగా తీసిన షాట్ సూపర్. ప్రతి ఫ్రేమ్ లోనూ డి.వి.వి.దానయ్య నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ఇక రాజమౌళి అప్పుడొక ఇంటర్వ్యూ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో హీరోల పాత్రలు ఎలాగుంటాయి అన్న ప్రశ్నకి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. "నేను డూప్లికేట్ హీరోస్ నే రియల్ హీరోస్ లాగా చూపిస్తాను.. ఇక కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు రియల్ హీరోస్ వాళ్ళని ఇంకేలాగ చూపిస్తానో మీ ఊహలకే వదిలేస్తున్న" అని చెప్పాడు. మొత్తానికి తను చెప్పినట్టే ఊహలకు తగ్గ రీతిలో ఈ ఇద్దరి హీరోస్ ని చూపించారంటూ నెటిజన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: