తెలుగు బిగ్ బాస్ సీసన్4 విజయవంతంగా నిన్నటితో 7 వారాలు పూర్తి చేసుకుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ కి హోస్ట్ గా అక్కినేని కోడలు సమంత రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  మూడు వారాల పాటు వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లాడు నాగార్జున. అక్కడే 21 రోజులు ఉండబోతున్నాడు. అందుకే తన మామ గారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ సమంత అక్కినేని వచ్చింది. తన బాధ్యతను తన కోడలికి అప్పగించాడు నాగార్జున. ఈమె 5 వారాల పాటు బిగ్ బాస్ షోను హోస్ట్ చేయాల్సి ఉంటుంది.

 నిజానికి 6 వారాలు చేయాల్సి ఉన్నా కూడా ఒక్క శనివారం ఎలాంటి హోస్ట్ లేకుండా కానిచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ షో కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ గురించే ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ 5 ఎపిసోడ్స్ కోసం నాగార్జున కంటే ఎక్కువ రెమ్యునరేషన్ సమంత తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. కేవలం ఐదు ఎపిసోడ్స్ కోసమే ఈమె ఏకంగా 2.10 కోట్లు తీసుకుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.ఈ లెక్కన దాదాపు ఎపిసోడ్‌కు 40 లక్షలకు పైగానే అన్నమాట. సీజన్ అంతా కలిపి నాగార్జున 8 కోట్ల వరకు తీసుకుంటుంటే.. సమంత మాత్రం కేవలం మూడు వారాల కోసమే 2 కోట్లకు పైగా తీసుకుంటుండటం మాత్రం నిజంగానే అద్భుతం.

మొత్తానికి బిగ్ బాస్ కోసం సమంత తీసుకున్న పారితోషికం హాట్ టాపిక్‌గా మారిపోయింది.ఇదిలా ఉంటె ఇక నిన్నటి ఎపిసోడ్ లో సమంత తన హోస్టింగ్ తో అదరగొట్టింది.హౌస్ మేట్స్ తో రచ్చ రచ్చ చేస్తూ.. వాళ్ళందరి సీక్రెట్స్ ను బయటపెడుతూ తన వాక్చాతుర్యం తో మైమరపించింది. ఇక ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ లుగా అఖిల్ అక్కినేని, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, కార్తికేయ లు బిగ్ బాస్ షో ని మరో లెవల్ కి తీసుకెళ్లారనే చెప్పాలి.అంతేకాదు దసరా సందర్భంగా ప్రసారం అయిన ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ కి భారీ టీఆర్పీ కూడా దక్కడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: