బిగ్ బాస్ హౌజ్ నుండి దివి ఎలిమినేట్ అయ్యింది. దసరా రోజు ఆమె హౌజ్ నుండి బయటకు పంపించేశారు. అయితే ఎలిమినేట్ అయితే అయ్యింది కాని ఫైనల్ ఎపిసోడ్ రేంజ్ లో ఆమెకు గ్రాండ్ గుడ్ బై చెప్పేశారు. సమంత హోస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ లో దివి హౌజ్ నుండి బయటకు రావడం విశేషం. ఇదిలాఉంటే అసలు ఈ వారం మోనాల్ వెళ్తుందని అనుకుంటే దివిని బయటకు పంపించేశారు ఏంటని ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.

దివి తన ఆట బాగానే ఆడుతున్నా అమ్మా రాజశేఖర్ తో స్నేహం చేయడమే ఆమె కొంప ముంచిందని తెలుస్తుంది. హౌజ్ లో బ్యూటిఫుల్ లేడీగా ఆడియెన్స్ నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న దివిన్ హౌజ్ లో అమ్మా రాజశేఖర్ తో క్లోజ్ అవడంతో తన ఆటని డిస్ట్రబ్ చేసింది. అయితే అలా కాకుండా దివి తన ఆటని సెపరేట్ గా ఆడి ఉంటే ఫాలోయింగ్ వచ్చేదేమో అని అంటున్నారు. హౌజ్ లో అరియానాకు కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ లేదు కాని ఆమె తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తుంది.

అలానే దివి కూడా అమ్మా రాజశేఖర్ తో కాకుండా సోలోగా ఆడినా ఎలిమినేట్ అయ్యేది కాదు. ఈ వారం మోనాల్ ను అఖిల్ నామినేట్ చేసినా సరే అఖిల్ ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అందుకే ఆమె ఇంకా హౌజ్ లోనే ఉంది. మొత్తానికి దివి ఎలిమినేట్ అవడానికి అమ్మా రాజశేఖర్ ఒక కారణమని చెప్పొచ్చు. అతనితో కాకుండా వేరే ఎవరితో అయినా జోడీ కట్టి ఉంటే సీన్ వేరేలా ఉండేదని అంటున్నారు. మొత్తానికి హౌజ్ నుండి అందమైన అమ్మాయి బయటకు వచ్చేసింది. ఇక మీదట రానున్న వారాలన్ని టఫ్ ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: