తెలుగులో ఇప్పుడు ఏదయినా సినిమా కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అంటే అది ఆర్.ఆర్.ఆర్ అనే చెప్పాలి. ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకేక్కిస్తుండగా మెగా హీరో రామ్ చరణ్ తేజ్, అలానే నందమూరి హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకి తగ్గట్టే మరింత మంది స్టార్స్ ని సినిమా కోసం రోప్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, అలియా భట్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు.

అజయ్ దేవగన్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మార్గదర్శకడి పాత్ర చేస్తుండగా అలియా భట్ ఏమో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన మరదలు పాత్ర సీత అనే కల్పిత పాత్రలో అలియా భట్ నటించనుంది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమెను ఈ సినిమా నుంచి తప్పించాలని గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే అవేవీ పట్టించుకోని రాజమౌళి మళ్ళీ ఆమెను సినిమాల్లో నటింపజేసేందుకు రప్పిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం ఆమె గంగూభాయి సినిమాలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్‌‌లో టైటిల్ రోల్ చేస్తోంది అలియా. 2020 సెప్టెంబర్‌ 11న ఈ గంగూబాయి కతియావాడిని విడుదల చేయాలని అనుకున్నా అది కరోనా వలన కుదర లేదు. ఈ సినిమా షూట్ ఈ వారంలో పూర్తి కానుందట. అది పూర్తి కాగానే ఆమె ఇక్కడకి వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: