తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్స్ గా వెలిగిన నటులు అయినటువంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులు ఇద్దరూ ప్రస్తుతం మన మధ్య లేనప్పటికీ కూడా వారు ఎప్పుడూ మన మదిలో నిలిచే ఉంటారు అని చెప్పకతప్పదు. ఎన్టీఆర్ ఓవైపు పౌరాణికాలు, జానపదాలు చేస్తూ ప్రేక్షకాదరణతో దూసుకెళ్తుంటే మరోవైపు సాంఘిక కుటుంబ కథా చిత్రాలు చేస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్లారు అక్కినేని. ఇక అక్కినేని వారసుడిగా కొన్నేళ్ళక్రితం విక్రమ్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు కింగ్ నాగార్జున.
తండ్రికి తగ్గ తనయుడు గా టాలీవుడ్ మన్మథుడు గా ఎన్నో గొప్ప సంచలన విజయాలు అందుకున్న నాగార్జున ఇటీవల తన తనయులు అయిన నాగచైతన్య, అఖిల్ లను హీరోలు గా రంగప్రవేశం చేయించారు. జోష్ సినిమా ద్వారా నాగచైతన్య టాలీవుడ్ కి హీరోగా పరిచయం అవగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ సినిమా ద్వారా అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవ్వడం జరిగింది. ఇటీవల నాగచైతన్య తన కెరీర్లో మంచి విజయాలు అందుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో కొనసాగుతున్నారు. అయితే తన కెరీర్లో ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలు చేసిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఎలాగైనా మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా పెద్ద విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఎస్విసిసి బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా దీని అనంతరం మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ఒక సినిమా చేయనున్నట్లుగా కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి తనకు తొలి సినిమా అఖిల్ ద్వారా భారీ ఫ్లాప్ ఇచ్చినప్పటికీ కూడా ఇటీవల వివి వినాయక్ చెప్పిన ఒక అద్భుతమైన మాస్ యాక్షన్ స్టోరీ ఎంతో నచ్చిన అఖిల్ అక్కినేని అతనితో మరో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. టాలీవుడ్ లోని ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయట. అఖిల్ మూవీ ద్వారా భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఈ హీరో, దర్శక ద్వయం తప్పనిసరిగా రాబోయే ఆ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకని క్రేజీ కాంబినేషన్ గా పేరు సంపాదిస్తారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: