బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఎవరు ఎవరికి సపోర్ట్ అన్నది మాత్రం అర్ధం కాకుండా ఉంది. అభిజిత్, హారిక ఒకే జట్టు అనుకున్నా ఈమధ్య హారిక కూడా అభిజిత్ తో అంతగా టైం స్పెండ్ చేయట్లేదు. ఇక మరో పక్క అఖిల్, మోనాల్ ఒకరోజు గొడవ పడితే మరో రోజు కలుస్తున్నారు. వారిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది వారికైనా తెలుసో లేదో అన్నట్టుగా పరిస్థితి ఉంది.

సోహెల్ మాత్రం అందరితో కలివిడిగా ఉన్నా సరే అఖిల్ కే తన ఫుల్ సపోర్ట్ అంటున్నాడు. ఇక అవినాష్, అరియానాలు ఒకే జట్టుగా ఉన్నారు. అయితే అఖిల్ మీద కోపంతో అభిజిత్ కూడా అవినాష్, అరియానాలతో క్లోజ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో ఎవరికి ఎవరు అంటే ఆడియెన్స్ కు కూడా అర్ధం కాని ప్రశ్నగానే ఉంది. నామినేషన్స్ లో ఈ వారం నలుగురు ఉండగా వారిలో మోనాల్ ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఇక అరియానా కూడా డేంజర్ జోన్ లో ఉన్నా కూడా అఖిల్, అవినాష్ లలో పెట్టిన ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ లో అవినాష్ కు హౌజ్ మేట్స్ లో మెజారిటీ ఓట్స్ రావడంతో అవినాష్ ఎవిక్షన్ ఫ్రీని గెలుచుకున్నాడు. ఈ ఎవిక్షన్ ఫ్రీ రెండు వారాల పాటు వ్యాలిడిటీ అని చెప్పాడు బిగ్ బాస్. ఇక ఈ వారం నలుగురిలో అఖిల్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పొచ్చు. హౌజ్ నుండి అఖిల్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.                                    
  

మరింత సమాచారం తెలుసుకోండి: