సినిమాలో హీరో హీరోయిన్ ఎంత కీలకమో బాలనటులు కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమాలయితే చైల్డ్ ఆర్టిస్టులని కీలక పాయింట్ గా పెట్టుకొని కథ రాస్తూ ఉంటారు. ఆలా చైల్డ్ ఆర్టిస్ట్ సెంటిమెంట్ చాల సినిమాల్లోనే వర్క్ అయ్యింది. ఆలా హిట్ అయినా సినిమాల్లో నటీనటుల పేర్లు కూడా మర్చి పోయి వారు చేసిన పాత్ర ఎప్పటికి గుర్తుంది పోతుంది. అలాంటి సినిమాలే ఆ చైల్డ్ ఆర్టిస్టుల కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతాయి కూడా. మరి ఆలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న బాలనటి సారా అర్జున్. ఈ బుల్లి తారని ఇప్పటికి నాన్న సినిమాలో వెన్నెల పాత్రతోనే అందరూ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా నాన్న సినిమాలో క్లైమాక్స్ సీన్ లో సారా నటన అద్భుతం. అంత చిన్న వయసులో సారా పలికిన ఎమోషన్స్ చూస్తే అందరికి ఇప్పటికి ఆశ్చర్యమే.

ఇక సారా మొదటి సినిమా ఫోర్ నాట్ ఫోర్. ఈ సినిమా 2011లో వచ్చింది. దైవ తిరుమగళ్ అనే తమిళ్ సినిమాలో అదే ఏడాది నటించింది. ఇదే సినిమాను తెలుగులో నాన్న అనే పేరుతో డబ్బింగ్ చేసారు. స్టాలిన్ రీమేక్ హిందీలో జై హో లో నటించిన సారా, శైవం అనే మరో సినిమాతో తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంది.  శైవం సినిమా తెలుగులో దాగుడుమూత దండాకోర్ పేరుతో రీమేక్ చేయబడింది. హిందీ లో ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా మరియు సాండ్ కీ ఆంఖ్ వంటి హిందీ సినిమాల్లో కూడా నటించింది.

హీరోయిన్ గా ఎంట్రీ

 సిల్లు కరుపట్టి అనే తమిళ్ చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించిన సారా మరిన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధం అవుతుంది. ఇక సారా తండ్రి రాజ్ అర్జున్  కూడా నటుడే. ఈ మధ్య కాలం లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన రాజ్ అర్జున్ కొన్ని హిందీ సినిమాల్లో సైతం నటించాడు .
 

మరింత సమాచారం తెలుసుకోండి: