సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో అవకాశం కోసం ఎవరెన్ని పాట్లు పడతారో చూసే అభిమానులకు పెద్ద అవగాహనా ఉండదు. వాళ్ళు నవ్వినా ఏడ్చినా ప్రేక్షకులకు మాత్రం నవ్వే వస్తుంది. కానీ సినిమా వాళ్లకు మాత్రం అదే ఉద్యోగం. అవకాశం కోసం హీరోయిన్స్, హీరోస్ పడే వ్యధలు మనకు తెలియదు. అలాగే తమ వయసుకు మించిన పాత్రల్లో కూడా నటిస్తూ ఉంటారు. అలాగే ఒక హీరో కి హీరోయిన్ గా నటించిన తర్వాత వారికే తల్లిగా కూడా నటించిన నటీమణులు ఉన్నారు. మరి ఆలా హీరోయిన్ తల్లి పాత్రలు పోషించిన బామలు ఎవరో చూద్దాం.

సుజాత : ఈ నటి మొదటగా ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవితో కలిసి హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి కి తల్లిగా నటించింది.

భానుమతి : ఎన్టీ రామారావు తో భానుమతి హీరోయిన్ గా మల్లీశ్వరి, తోడు నీడ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రోజుల్లో అదే ఎన్టీఆర్ కి సామ్రాట్ అశోక చిత్రంలో తల్లిగా నటించింది.

శారద : సూపర్ స్టార్ కృష్ణ శారదా రాధమ్మ పెళ్లి, అనుబంధాలు, ఆడంబరాలు, ఇంద్రధనస్సు  చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత రోజుల్లో అగ్నిపర్వతం, అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్ సినిమాల్లో కృష్ణ కి తల్లిగా నటిచింది.

జయసుధ :  మగధీరుడు, ఇది కథ కాదు సినిమాల్లో చిరంజీవి తో హీరోయిన్ గా నటించిన జయసుధ, రిక్షావోడు సినిమాలో  అతని పక్కన తల్లిగా నటించింది

అంజలీ దేవి :   ఏఎన్ఆర్ తో కలిసి భక్తతుకారాం, సువర్ణసుందరి సినిమాల్లో హీరోయిన్ నటించింది అంజలి దేవి. ఆ తర్వాత రోజుల్లో ఆయనకు తల్లిగా చాల సినిమాల్లో నటించింది.  

వరలక్ష్మి : బబ్రువాహన, సత్య హరిశ్చంద్ర, మహామంత్రి తిమ్మరుసు సినిమాల్లో వరలక్ష్మి, ఎన్టీఆర్ లు హీరో హీరోయిన్స్ గా కలిసి నటించారు.  ఆ తర్వాత అగ్గి రవ్వ, ప్రేమ సింహాసనం, కలియుగ రాముడు, వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాల్లో ఎన్టీఆర్ కి తల్లి పాత్రల్లో నటించారు వరలక్మి. 

మరింత సమాచారం తెలుసుకోండి: