పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ పింక్ రీమేక్ గా చేస్తున్న వకీల్ సాబ్ సినిమా టీజర్ సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ ను తెలుగులో పవన్ చేస్తుంటే అమితాబ్ సినిమా పవన్ చేయడం ఏంటని అనుకున్నారు. కాని టీజర్ చూశాక తెలిసింది.. ఎలాంటి కథ అయినా సరే పవర్ స్టార్ చేశాడంటే దాని రేంజ్ మారిపోవాల్సిందే. వకీల్ సాబ్ సినిమా కథ మెసేజ్ తో వస్తున్నా ఆ సినిమాకు కమర్షియల్ అంశాలు కూడా యాడ్ చేశారని తెలుస్తుంది.    

పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది. సినిమా టీజర్ లో కూడా పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగానే కోర్ట్ లో వాధించడము తెలుసు.. కోర్ట్ తీసి కొట్టడము తెలుసు.. అనే డైలాగ్ అదిరిపోయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. వకీల్ సాబ్ అనగానే ఇదేదో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటే పొరబడినట్టే.. అక్కడ ఉంది పవర్ స్టార్ బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మరోసారి పవన్ స్టామినా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు.

వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలిలు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాకు థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మగువ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక వకీల్ సాబ్ టీజర్ చూస్తే పవర్ స్టార్ మార్క్ పక్కాగా కనిపిస్తుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవగా వకీల్ సాబ్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: