యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కె.జి.ఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న క్రేజీ మూవీ సలార్. కె.జి.ఎఫ్ నిర్మాతలే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సలార్ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లగా అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఏడాది తర్వాత రిలీజ్ డేట్ ని కూడా ముందే ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నారు. ఇంతకీ ప్రభాస్ సలార్ రిలీజ్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 14, 2022 అని ప్రకటించారు.

కె.జి.ఎఫ్ సినిమా బంగారు గనుల కోసం జరిగిన యుద్ధంగా చూపిస్తే.. ఈసారి ప్రభాస్ తో బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. పవర్ ఫుల్ టైటిల్ తో.. పవర్ ప్యాక్డ్ ఎనర్జీతో ఈ సినిమా వస్తుంది. ఈమధ్యనే ఇల్లందు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకున్నారు. సలార్ తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్.

ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో చేస్తున్న రాధే శ్యాం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ సినిమా తర్వాత సలార్ తో పాటుగా ఆదిపురుష్ కూడా లైన్ లో ఉంది. అయితే ప్రభాస్ సలార్ స్పీడ్ గా షూటింగ్ చేయడం గురించి కూడా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సినిమా ఏదో అలా చుట్టేస్తున్నాడా ఏంటి అంత స్పీడ్ గా ప్రశాంత్ నీల్ ఎందుకు చేస్తున్నాడని డౌట్ పడుతున్నారు. రాధే శ్యాం సినిమా ఈ ఏడాది జూలై 30న రిలీజ్ ప్లాన్ చేశారు. పూజా హెగ్దే, ప్రభాస్ ఇద్దరు సూపర్ కాంబోగా క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్నారు.                             



మరింత సమాచారం తెలుసుకోండి: