తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి లు కలిసి ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి కాగా ప్రస్తుతం సినిమాలో చిరంజీవి, చరణ్ లకు సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది యూనిట్. ఇక ఇటీవల ఈ మూవీ నుండి మెగాస్టార్, మెగాపవర్ స్టార్ లు కలిసి ఉన్న రెండు ఫోటోలు లీక్ అయి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయ్యాయి. అలానే కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. 

కాగా ఈ మూవీని ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏమిటంటే కొద్దిసేపటి క్రితం ఆచార్య సిద్ధమవుతున్నాడు అంటూ చరణ్ పాత్ర గురించి కొంత హింట్ ఇస్తూ యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇందులో మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా ఆయన అనుచరుడిగా మరొక నక్సలైట్ గా చరణ్ నటిస్తున్నట్లు నేడు రిలీజ్ చేసిన పోస్టర్ ని బట్టి చూస్తే ఒకింత మనకు అర్ధం అవుతుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి, చరణ్ భుజంపై చేతిని ఉంచడం, ప్రక్కన గన్ పది ఉండడం గమనించవచ్చు. కామ్రేడ్ గా నటిస్తున్నందకు, అది కూడా నాన్న, కొరటాల గారితో పని చేయడం సరికొత్తగా ఉంది అంటూ చరణ్ ఆ పోస్టర్ పై తన సోషల్ మిడియా అకౌంట్స్ ద్వారా స్పందించారు. దీనితో చరణ్ కూడా ఇందులో ఒక నక్సలైట్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు మరింతగా ప్రచారం అవుతున్నాయి. కాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్నట్లు టాక్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: