టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోలలో కింగ్ నాగార్జున ముందు వరుసలో ఉంటాడు. వయసు ఆరు పదులు దాటినప్పటికి కుర్ర హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిజిక్ తో ఇప్పటి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతే కాకుండా కెరియర్ మొదటి నుండి కూడా కొత్త ప్రయోగాలు చెయ్యడంలో నాగ్ ఎప్పుడు ముందే ఉంటారు. ఫుల్ పక్కా మాస్ గా కనిపించాలన్న, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించాలన్న, అధ్యాత్మిక కోవలో భక్తుడిలా కనిపించాలన్న ఒక్క నాగ్ మాత్రమే చెయ్యగలరు అనేంతలా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇక కొత్త దర్శకులను పరిచయం చెయ్యడంలో కూడా నాగ్ ఎప్పుడు ముందే ఉంటారు. 

అయితే నాగార్జున గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ను ఎదుర్కొంటున్నాడు. "సోగ్గాడే చిన్నినాయన ", " ఊపిరి " వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత దాదాపుగా అరడజన్ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాటాపట్టాయి. ఓం నమో వెంకటేశాయ, రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాసు, మన్మథుడు 2, వైడ్ డాగ్, ఇలా అన్నీ కూడా ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో నాగ్ స్టార్ జాబితా నుండి ఫెడ్ అవుట్ అవుతున్నాడనే కామెంట్స్ గట్టిగానే వింపిస్తున్నాయి. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,  వెంకటేష్, ఇప్పటికీ కూడా తమ సినిమాలతో స్ట్రాంగ్ వసూళ్లనే నమోదు చేస్తున్నాడు. అయితే నాగ్ మాత్రం వీరితో పోలిస్తే చాలా వెనుకబడ్డాడనే చెప్పాలి.

ప్రస్తుతం నాగార్జున "గరుడ వేగ " ఫెడ్ అవుట్ అయిన రాజశేఖర్ కు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.. ఈ సినిమాలో నాగ్ మరొకసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇక నాగ్ ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమానైనా కింగ్ నాగార్జునకు సరైన విజయాన్ని అందిస్తుందో..లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: