నికిషా పటేల్ గుర్తుందా? అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్.... మొదటి సినిమానే పవర్ స్టార్ తో చేసిన ఈ హాట్ బ్యూటీ అప్పుడు యూత్ ని తన హాట్ నెస్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో ఈ హాట్ బ్యూటీ పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అనుకున్నారు. కాని పాపం నికిషా కి అంత అందం, అభినయం ఉన్నా అదృష్టం మాత్రం కలిసిరాలేదు. కొమరం పులి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ మూవీ తరువాత నికిషాకు చిన్న సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి.కన్నడ, తమిళ భాషల్లోని సినిమాల్లో నటించిన నికిషాకు ఆ ఇండస్ట్రీల్లో నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.మరోవైపు నికిషా పటేల్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.


గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నికిషా పటేల్ ప్రయత్నిస్తున్నది. 2006 సంవత్సరంలో యూకేలో మిస్ వేల్స్ పోటీలో నికిషా పటేల్ ఫైనలిస్ట్ గా నిలిచింది.  తెలుగులో నికిషా చివరగా అరకు రోడ్ లో అనే సినిమాలో నటించారు. 2016 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.కాని ఆ సినిమా కూడా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.అయితే ఈమె ప్లాప్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న కాని హాట్ హీరోయిన్ గా యూత్ మనసులో మంచి ముద్రే వేసుకుందని చెప్పాలి.ఇక ఆ తరువాత ఈ హాట్ బ్యూటీ ఏం చేస్తుందో ఏమో అని అందరూ అనుకున్నారు.అయితే ప్రస్తుతం ఈ హాట్ హీరోయిన్ బ్రిటన్ లో రెగర్ మేనేజ్మెంట్ లో పని చేస్తున్నదని సమాచారం అందింది. అయితే వయస్సు పెరుగుతున్నా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఆశ పడుతున్న ఈ హీరోయిన్ ఒక మంచి మూవీతో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నదని సమాచారం అందుతుంది.రీఎంట్రీలోనైనా ఈ హాట్ హీరోయిన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంతుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: