ప్రస్తుతం సంగీత ప్రపంచంలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న పాటగాడు సిడ్ శ్రీరామ్.. టాలీవుడ్ లో వచ్చే ప్రతి సినిమాకి మొదటి పాటను సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్ చేస్తూ సినిమాపై క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు.. సిద్  శ్రీరామ్ పాట ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు.. నిజానికి టాలీవుడ్ సిద్ పాటను మొదట రిలీజ్ చేయడం ఒక సెంటిమెంట్ గా ఉంది.. తొలుత పెద్ద సినిమాలకు మాత్రమే పాడే సిద్ శ్రీరామ్ ఆ తర్వాత చిన్న సినిమాలకు పాడడం మొదలు పెట్టాడు..

భాష వేరైనా తెలుగు భాష మీద పట్టు సంపాదించి అక్షరం కూడా పొల్లు పోకుండా పాడుతున్నాడు సిద్ శ్రీరామ్.. టాలీవుడ్ లో ఒక ప్రచారం ఇప్పుడు ఆయన మీద ఉంది అది ఏంటంటే ఒక పాటకి పది లక్షలకు పైగా తీసుకుంటున్నాడని , చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు అని, అందుకే ఈ మధ్య అవకాశాలు తగ్గిపోతున్నాయి అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆర్ పి పట్నాయక్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు..

భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల పాటలతో వస్తున్న సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకీ 10 లక్షలకు పైగా పారితోషికం తీసుకున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు. ఒక్క పాటకు అరవై లక్షలు మాత్రమే తీసుకుంటున్నారు అని వివరణ ఇస్తూ జిఎస్టి కలుపుకొని కూడా అని చెప్పారు..ఇటీవలే మళ్లీ కొంత పెంచారంటు సిద్ శ్రీరామ్ పాటకు జిఎస్టి తో కలిపి 4 పాయింట్లు 50 లక్షలు తీసుకుంటున్నట్లు వివరించారు.. వారానికి ఒక్క పాట మాత్రమే పాడతాడని అది కూడా ట్యూన్ తనకు నచ్చితేనే పడతారు అని చెప్పాడు ఆర్పీ..

మరింత సమాచారం తెలుసుకోండి: