సినిమా తీయాలంటే ఎంతో మంది చెమటోడ్చి కష్టపడాలి. కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయాలి. అయినా ఆ సినిమా విడులయ్యే వరకు భయంభంగానే ఉంటుంది. హిట్ అవుతుందా..? ప్లాప్ అవుతుందా..? అని దర్శక నిర్మాతలకు, హీరోలకు భయంగానే ఉంటుంది. అయితే కొన్ని సార్లు సినిమా తెరకెక్కేటప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందా..? లేదా అని ముందుగా కొంత మేర అర్థమైపోతుంది. అలానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా తాను చేసిన ఓ సినిమా ప్లాప్ అవుతుందని అర్థమైందట. కానీ దర్శకనిర్మాతల కారణంగా ఆ సినిమా చేశాడట. చివరికి అది పవన్ అనుకన్నట్లే ప్లాప్ అయిందట. ఇంతకా ఆ సినిమా ఏదో తెలుసా..? బంగారం.

పవన్ ఓ జర్నలిస్ట్‌గా ఫ్యాక్షనిజం బాక్ డ్రాప్‌లో వచ్చిన బంగారం సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా దారుణంగా నిరాశ పరిచింది. తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించిన ఈ సినిమా పవన్ రేంజ్‌ను ఏ మాత్రం అందుకోలేకపోయింది. సినిమా కథలో పట్టు లేకపోవడం, డైరెక్షన్‌లోపాలు అన్నీ కలిసి సినిమాను దెబ్బ తీశాయి. అంతేకాకుండా అంతకుముందే కొద్ది రోజుల క్రింతం మహేశ్ పోకిరి విడుదల కావడం కూడా ఈ సినిమాపై భారీ ప్రభావం చూపింది. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా బయ్యర్లకు ఓ మోస్తరు నష్టాలు మిగిల్చింది. అయితే ఈ కథ చెప్పినప్పుడు వర్కౌట్ కాదని దర్శకుడు ధరణికి పవన్ చెప్పేశాడట. కానీ దర్శకుడు పవన్ చేతులు పట్టుకుని బతిమాలి సినిమా చేయించాడట.
 
ఈ విషయాలను ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి వెల్లడించాడు. దర్శకుడు ప్రాథేయపడడంతో సినిమా చేసిన పవన్.. చివరకు అనుకున్నట్లే ప్లాప్‌ను మూటగట్టుకున్నాడు. అంతేకాదు ప్రతి సారి తన సినిమాలకు విలువైన ఇన్ పుట్స్ ఇస్తుంటారు పవన్. బంగారం సినిమాకు అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో ఆయనకు హీరోయిన్ కూడా ఉండదు. దానికి తోడు క్లైమాక్స్ కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. దీంతో బంగారం సినిమా విడుదలైనప్పుడు పవన్ అభిమానులు చాలా నిరాశపడ్డారు. ఇప్పటివరకు 26 సినిమాలు చేసిన పవన్ కెరీర్లో ఇది కూడా ఓ ప్లాప్‌గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: