హీరోల మధ్య ఎంత పోటీ ఉన్న వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు వారి మధ్య ఉండే అనుబంధాన్ని ప్రేక్షకులకు వెల్లడిస్తూ తామంతా ఒక్కటే అని నిరూపిస్తూ ఉంటారు.. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో తమ తోటి హీరోల పై ఉండే ప్రేమను చూపిస్తూ వారి అనుబంధాన్ని బలపరుస్తూ ఉంటారు మన హీరోలు.. ముఖ్యంగా మన సీనియర్ హీరోలు కష్ట సమయాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ సినిమా పరిశ్రమలో స్నేహ బంధం అంటే ఇలా ఉండాలి అని చూపిస్తూ ఉంటారు..

చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్ ,నాగార్జున వీరు ఇప్పటికీ ఒకరి సినిమాలకి మరొకరు సపోర్ట్ చేసుకుంటూ వారి వారి సినిమాలు హిట్ చేసుకునే విధంగా ముందుకు తీసుకు వెళుతూ ఉంటారు.. ఇటీవలే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా కి చిరంజీవి ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు.. సినిమా ఫలితం ఎలా ఉన్నా వారి మధ్య స్నేహబంధం ఎప్పటినుంచో ఒకేలా ఉందని, అది ఎప్పటికీ కొనసాగిస్తూ ఉంటామని మరోసారి నిరూపించారు.. గతంలో కూడా ఈ సీనియర్ హీరోలు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇప్పుడు ఇంతటి స్టార్ లు గా ఎదిగారు.. అలాంటి ఓ సందర్భం ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం..

నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో తొలిసారిగా తెరకెక్కింది.. ప్రజెంట్ టైం లైన్ లో ఉన్న హీరో గతం లోకి, భవిష్యత్ లోకి ఎలా ప్రయాణించాడు.. అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఇందులో చూపించారు.. వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ సినిమాను చేయాలని ప్రతి హీరో పోటీపడ్డ చివరికి అది నందమూరి బాలకృష్ణ ను వరించింది.. తమకు ఈ సినిమా రాలేదని నిరాశ పడకుండా తమ తోటి హీరో బాలకృష్ణకు వచ్చినందుకు ఎంతో సంతోషపడ్డారు మిగిలిన హీరోలు.. ప్రమోషన్ టైమ్ లో ఈ సినిమాకి హెల్ప్ చేశారు కూడా.. మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి లు ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కాన్సెప్ట్ ట్రైలర్ ను దూరదర్శన్ లో విడుదల చేశారు.. అప్పటికే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్న చిరంజీవి ఇలా తనకు పోటీ వచ్చే హీరో సినిమా ను ప్రమోట్ చేయడం అంటే గొప్ప విషయమే...

మరింత సమాచారం తెలుసుకోండి: