స్టార్ హీరోల వారసులను ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తున్నదే. కాని మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ డైరెక్ట్ గా చిరుత సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో చరణ్ హీరోగా మొదటి సినిమా చేశాడు. అయితే రాం చరణ్ కూడా బాల నటుడిగా ఒక సినిమాలో నటించాడట. దాసరి నారాయణ రావు 100వ సినిమా లంకేశ్వరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఆ సినిమాలో చరణ్ బాలనటుడిగా నటించాడట. అయితే సినిమా ఎడిటింగ్ లో చరణ్ పాత్ర తీసేయించారట.

సినిమాలో చరణ్ పాత్ర అనుకున్న విధంగా రాలేదట. అంతేకాకుండా సినిమాకు ఆ పాత్ర అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాకపోవడంతో సినిమాలో ఆ పాత్రని ట్రిం చేయించారట దర్శకులు దాసరి నారాయణ రావు. ఆ తర్వాత చాలామంది దర్శకులు రాం చరణ్ ను బాల నటుడిగా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నా కుదరలేదట. అదీగాకుండా చిరంజీవి సూపర్ హిట్ ఫాం లో ఉన్న టైం లో చరణ్ ఎంట్రీ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదట. అలా చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ కాకుండానే హీరోగా తెరంగేట్రం చేశాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా సినిమాకు తన నటనా పరిణితి పెంచుకుంటూ పరిపూర్ణ నటుడిగా చరణ్ తన సత్తా చాటుతున్నాడు. అంతకుముందు తనని చూసి నవ్విన వారందరిక్ రంగస్థలం సినిమాలో చిట్టి బాబు పాత్రతో రీ సౌండ్ వచ్చేలా చేశాడు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడని తెలిసిందే. త్వరలో శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రాం చరణ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.  ఈ సినిమాతో కూడా మరోసారి నేషనల్ లెవల్ లో సత్తా చాటనున్నాడు చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: