హ్యాపీడేస్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వ‌ర‌ణ్ సందేశ్‌. ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపించే వ‌రుణ్ సందేశ్ కు హ్యాడీ డేస్ సినిమాతో మంచి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇక త‌రువాత వ‌చ్చిన ఒకటి రెండు సినిమాలు త‌ప్ప కేరీర్ లో పెద్ద విజ‌యాలు లేవ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ప్ర‌తీ సినిమాలో వ‌రుణ్ సందేశ్ క్యూట్‌గా క‌నిపిస్తుంటాడు. ల‌వ‌ర్ బాయ్‌గా అధిక సినిమాల్లో క‌నిపించాడు. బిగ్ బాస్ షోలో త‌న భార్య‌తో క‌లిసి పార్టిసిపేట్ చేశాడు.  బిగ్ బాస్ షో ద్వారా ప్ర‌తీ తెలుగింటికి ప‌రిచ‌యం అయ్యాడు వ‌రుణ్ సందేశ్‌. ఒక బిగ్ బాస్ ముగిసిన త‌రువాత ప‌లు రియాలిటీ షోల‌లో క‌నిపించాడు. ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉన్నాడు. బిగ్ బాస్ షో త‌న‌కు మ‌రింత గుర్తింపును తీసుకొచ్చింది.

అయితే సినిమాల్లో పెద్ద హిట్ సినిమాలు లేక‌పోవ‌డం కొంత అసంతృప్తి క‌లిగించే విష‌యం. అయితే కెరీర్ తొలినాళ్ల‌లో వ‌చ్చిన కొత్త బంగారులోకం సినిమా మాత్రం టీనేజ్ కుర్ర‌కారు మ‌తి పోగొట్టింది. ఆ సినిమాల్లోని సాంగ్స్, డైలాగ్‌లు పెద్ద హిట్‌. నాన్న సెంటిమెంట్‌, టీనేజ్ మ‌న‌స్త‌త్వం ఆ సినిమాల్లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. వ‌రుణ్ సందేశ్ న‌ట‌న ఆ సినిమాలో చాలా న్యాచుర‌ల్‌గా ఉంది. ఇక అప్పటి నుంచి వ‌రుణ్ సందేశ్‌కు తిరుగులేదు అని అనిపించింది. కానీ అనుకున్నంత‌గా హిట్‌లు రాలేదు.

అయితే రాబోయే సినిమాలో ఒక కొత్త యాంగిల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇది వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో అత్య‌ధికంగా ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపించిన వ‌రుణ్ సందేశ్‌.. ఇప్పుడు రొమాంటిక్ బాయ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు ఇందువ‌ద‌న‌. ఈ ఇందువ‌ద‌న సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌లో రొమాంటిగ్ యాంగిల్ క‌నిపించాడు వ‌రుణ్ సందేశ్‌. అయితే పోస్ట‌ర్ మీదే అలాంటి గెట‌ప్ ఉందంటే సినిమాల్లో ఇంకెలా ఉంటాడో అని సినిమా అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా వ‌రుణ్ సందేశ్ కొత్త గెట‌ప్ ఆయ‌న‌కు మంచి స‌క్సెస్ అందించాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: