సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు ఉండే ప్రత్యేకత వేరు. తమ అందచందాలతో ప్రేక్షకులను వారు ఆకట్టుకోవడమే కాకుండా నటనా పరంగా కూడా వారిని అబ్బుర పరుస్తూనే ఉంటారు. హీరోయిన్ లు అంటే కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే కాకుండా నటనను కూడా అద్భుతంగా చేస్తారని ఎంతో మంది హీరోయిన్ లు ఇప్పటివరకు నిరూపించారు. అందం అభినయం కలగలిసిన ఎంతో మంది హీరోయిన్లు స్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

హీరోయిన్ లకు టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటారు అప్పుడే వారికి వరుస అవకాశాలతో పాటు స్టార్డం దక్కే ఛాన్స్ ఉంటుంది. టాలెంట్ ఉన్నా హీరోయిన్ గా ఎదగలేని ఎంతోమంది కథానాయికలను మనం ఇప్పటికే చూశాం. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా తో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిన కథానాయిక షాలిని పాండే. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్డమ్ అందుకొని స్టార్ హీరోగా మారిపోగా షాలిని కి కూడా అంతే క్రేజ్ వచ్చింది. కానీ ఆమె తన తదుపరి సినిమా అవకాశాలు రాబట్టుకోవడంలో మాత్రం విఫలం అయింది.

ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత హీరోయిన్ కు అవకాశాలు రాలేదు అంటే నిజంగా ఆమె దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని తరాలు చెప్పుకునేలా అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయింది. అలాంటి సినిమా లో నటించిన హీరోయిన్ ఇప్పటికే పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేయాలి కానీ అలా తన కెరీర్ ను  చేసుకోలేకపోయింది షాలిని. ఒకటి రెండు సినిమాలతోనే సర్దుకుని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని క్రేజీ సినిమాలకు సంతకాలు చేస్తుందట. తాజాగా ఓ ఫోటో షూట్ లో తన అందాలతో చెలరేగింది షాలిని. ఏకంగా సిక్స్ ప్యాక్ లుక్ తో దర్శనమిచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా ఫోటోలను పోస్ట్ చేయడంతో ఆమెకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. తన శరీరాకృతిలో ఇలాంటి మార్పులు తీసుకువచ్చి ప్రేక్షకులను, సినిమా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి ఆమెకు తెలుగులో ఇప్పటికైనా మంచి అవకాశాలు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: