టాలీవుడ్ లో చాలా తక్కువ స్పాన్ కెరియర్ కలిగిన వారు హీరోయిన్ లు అని చెప్పొచ్చు. ఒక హీరో లైఫ్ టైం హిట్ లు వేస్తే సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఇంకెవరైనా అవకాశాలు వస్తున్న కొద్దీ సినిమాలు చేస్తూనే ఉంటారు. కానీ హీరోయిన్ లు అలా కాదు. వరుసగా 20 సినిమాలు చేసిన తర్వాత వారికి సినిమా అవకాశాలు రావు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక వారు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతుంటారు. వారు గట్టిగా పదేళ్లు సినిమా చేస్తే చాలు ఆ తర్వాత మెల్లగా సినిమా అవకాశాలు తగ్గి ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.

ప్రేక్షకులు కొత్త అందాలను కోరుకోవడం తో వారికి అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్ లు గట్టిగా పేరు వచ్చిన హీరోయిన్ లు 10 ఏళ్లకు మించి హీరోయిన్ లు గా కొనసాగలేదు. కొంతమంది రెండేళ్లు, మూడెళ్లు మహా అయితే ఐదేళ్ల వరకు హీరోయిన్ గా రాణించారు. అందులో ఎవరో ఒకరు ఇద్దరు తప్ప పది పదిహేను సంవ్సత్సరాలు హీరోయిన్ లుగా కొనసాగలేదు. 

ఆ విధంగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ లుగా వెలుగొందుతున్న కొంత మంది హీరోయిన్ లకు వణుకు పుట్టిస్తుంది హీరోయిన్ నాభ నటేష్ అని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఒక్కసారిగా పేరు పాపులారిటీ దక్కించుకుంది నాభా. ఆ సినిమాలో ఆమె పోషించిన చాందిని పాత్రకు విశేషమైన పేరు క్రేజ్ అందుకుంది. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకాడనీ ఈమె ఆ తర్వాత మంచి మంచి సినిమాల్లో నటించి తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రో అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వస్తుండడంతో ఇతర హీరోయిన్ లకు టెన్షన్ పట్టుకుందట. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: